యువత రాజకీయాల్లోకి రావాలి.. దేశ భవిష్యత్తును యువతే నిర్ణయించాలి..

విశ్వంభర, నాగోల్: యువత రాజకీయాల్లోకి రావాలి... దేశ భవిష్యత్తును యువతే నిర్ణయించాలని, కేంద్ర యువజన వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఉద్యమాల్లోకి రావాలని న్యూ నాగోల్ సీపీఐ ప్రజా సంఘాల కార్యాలయం  డాంగే భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పి.శివకుమార్ గౌడ్ అన్నారు..సరూర్ నగర్ నూతన కమిటీ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి గా మధుకర్,మాదగోని అరుణ్ గౌడ్ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగ శ్రీకాంత్, శివ,అరుణ్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశంలో అత్యధిక జనాభా యువతదే అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ విధానాలు యువతకు ఉపాధి, విద్య, భద్రత కల్పించే దిశగా కాకుండా ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, ఔట్‌సోర్సింగ్, ప్రభుత్వ రంగ సంస్థల బలహీనీకరణ వైపు సాగుతున్నాయని విమర్శించారు. జాతీయ యువజన విధానం పేరుతో ప్రకటనలు చేస్తున్నా, యువతకు శాశ్వత ఉద్యోగాలు, నాణ్యమైన ప్రభుత్వ విద్య, అందుబాటు వైద్యం, నైపుణ్యాభివృద్ధి, ప్రజాస్వామ్య భాగస్వామ్యం వంటి అంశాలపై స్పష్టమైన హామీలు అమలు కావడం లేదన్నారు. దేశ నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయకుండా, ఎన్నికల సమయంలో మాత్రమే యువతను గుర్తు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే  తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు యువతకు కొత్త దిశానిర్దేశం చేసే చారిత్రాత్మక వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.  కార్యక్రమంలో  జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్,నాయకులు క్రిష్ణ,సందీప్,సతీష్ రెడ్డి,రమేష్,వెంకన్న,శ్రవణ్,దీపు,రాకేష్ గౌడ్,రవి,జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

🕒 09 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/youth-should-come-into-politics-the-future-of-the-country/article-21265

Tags: