బీసీల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు సాగాలి

విశ్వంభర, హైదరాబాద్‌: బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి ప్రజాప్రతినిధులు, బీసీ నాయకులు, కుల సంఘాలు ఐక్యంగా పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ నివాసంలో జరిగిన బీసీ ముఖ్య నేతల సమావేశం నిర్ణయించింది. బీసీ కులగణన తదుపరి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంతో పాటు బీసీ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి చేర్చడంపై సమావేశంలో చర్చించారు. ఈ నెల 14న హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌ సమీపంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ, 18న ట్యాంక్‌బండ్‌పై సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించాలని, రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, బీసీ కుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని పిలుపునిచ్చారు. బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు, తగిన నిధుల కేటాయింపు, బీసీ కమిషన్‌ను బలోపేతం చేయడం, పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయడం వంటి అంశాలపై కృషి చేయాలని నిర్ణయించారు. బీసీ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరేలా చర్యలు తీసుకోవడంతో పాటు వివిధ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సమావేశం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, బీసీల హక్కులు, అభ్యున్నతి కోసం నాయకులంతా సమన్వయంతో ముందుకు సాగాలని నేతలు పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు, ఇతర బీసీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ జూమ్‌ ద్వారా పాల్గొన్నారు.

🕒 09 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/we-should-move-forward-unitedly-to-solve-the-problems-of/article-21256

Tags: