గిరిజన సంక్షేమానికి కేంద్రం మరింత అండగా నిలవాలి

  •  రూ.70 కోట్ల అదనపు నిధులు, రూ.452.05 కోట్ల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ బకాయిల విడుదల చేయండి
  • కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువాల్ ఓరాంను కలిసి వినతిపత్రం సమర్పించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

విశ్వంభర, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర గిరిజనుల సంక్షేమం, విద్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు కీలక అంశాలపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ( డిల్లీలో) ఏపీ జితేందర్ రెడ్డితో కలిసి శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువాల్ ఓరాంను కలిసి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులను తక్షణమే విడుదల చేయాలని, గిరిజన సంక్షేమ పథకాలకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని మంత్రి కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి తెలంగాణ రాష్ట్రానికి విడుదల శాఖకు సంబంధించిన పెండింగ్ నిధులను మొత్తం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు . కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో.. మౌలిక సదుపాయాలైన రోడ్లు ఇతర అవసరాల కోసం కేంద్రం నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గిరిజన ప్రాంతాల లో రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించాలని కేంద్ర మంత్రి  కోరారు.అలాగే  హైదరాబాదులో గిరిజన సంక్షేమ శాఖ ఉన్నత  అధికారులతో  సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని హైద్రాబాద్ లో ఏర్పాటు చేస్తానని అడ్డూరి లక్ష్మణ్ కోరగా  కేంద్రమంత్రి తప్పకుండా హాజరవుతానని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గిరిజన ప్రాంతాల్లో విద్య, మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాల విస్తరణకు ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.తెలంగాణ అభివృద్ధికి అవసరమైన కేంద్ర సహాయాన్ని సానుకూలంగా పరిశీలించి పెండింగ్‌లో ఉన్న నిధులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువాల్ ఓరాంను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/center-should-be-more-supportive-of-tribal-welfare/article-21127

Tags: