ప్రభుత్వ పాఠశాల తనిఖీ చేసిన సర్పంచ్ 

ప్రభుత్వ పాఠశాల తనిఖీ చేసిన సర్పంచ్ 

విశ్వంభర, గుండాల: బండకొత్తపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలను గ్రామ సర్పంచ్ గద్వాల ఉపేందర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న విద్యా విధానం, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల బోధన తీరు, స్టడీ అవర్స్ నిర్వహణ, విద్యార్థుల అభ్యాస పురోగతి తదితర అంశాలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సర్పంచ్ సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలను విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందిస్తూ ప్రభుత్వ పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం అనంతరం సర్పంచ్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, మెనూ అమలు, వడ్డింపు విధానాన్ని స్వయంగా పరిశీలించారు. విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి వారి చదువులు, ఆరోగ్యం, పాఠశాలలో ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య అందించడమే తన ప్రధాన లక్ష్యమని సర్పంచ్ గద్వాల ఉపేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గోపాలదాస్ రాములు, చీకటి ఉషా ఉపేందర్, గ్రామీణ బ్యాంకు డైరెక్టర్ సునీల్ రెడ్డి, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, యర్రయ్య, శేఖర్ రెడ్డి, సాయి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/sarpanch-inspecting-government-school/article-21139

Tags:  

Advertisement

LatestNews

గుడుంబా,మద్యం వ్యాపారి నెటుల శోభారాణిపై పీడీ యాక్ట్. 
అవినీతి చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తా. - మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు 
మంత్రి కోమటిరెడ్డి చేతులమీదుగా  గద్దర్ డాక్యుమెంటరీ చిత్ర పోస్టర్ ఆవిష్కరణ. 
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జిహెచ్ఎంసి అధికారి ప్రభావతి.
మంత్రి సీతక్కను కలిసిన పద్మశాలి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ల చైర్మన్లు
శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే