తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

  • హైదరాబాద్‌లో ప్రత్యేక భేటీ.. ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

CM Revanth Reddy: హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు పరస్పరం అభివాదాలు చేసుకుని సమావేశమయ్యారు. ఈ మర్యాదపూర్వక సమావేశంలో మంత్రి అజారుద్దీన్ పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు రామకృష్ణారావుతో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు.

తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ వేదికగా జరిగిన ఈ భేటీ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అయితే సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-V హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో ఈ మర్యాదపూర్వక సమావేశం జరిగింది. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

Read More తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్, హరీశ్‌రావు.. గాయాలను పరిశీలించిన హరీశ్‌రావు