హైదరాబాద్‌లో బీజేపీ మహిళా మోర్చా భారీ స్కూటీ ర్యాలీ

హైదరాబాద్‌లో బీజేపీ మహిళా మోర్చా భారీ స్కూటీ ర్యాలీ

  • తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా స్కూటీ ర్యాలీ

BJP Mahila Morcha: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారీ స్కూటీ ర్యాలీ నిర్వహించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి సర్దార్ పటేల్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. బీజేపీ మహిళా మోర్చాకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్కూటీలపై ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ నగరంలోని ప్రధాన మార్గాల మీదుగా సాగింది. మహిళా మోర్చా శ్రేణులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొనడంతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది. చివరగా సర్దార్ పటేల్ విగ్రహం వద్దకు ర్యాలీ చేరుకుంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ స్కూటీ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Read More మాధాపూర్‌లో నిషేధిత ఈ-సిగరెట్ల దందా.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

Related Posts