చండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ డా. కోడి శ్రీనివాసులుకు ఘన సన్మానం. 

చండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ డా. కోడి శ్రీనివాసులుకు ఘన సన్మానం. 

విశ్వంభర, హైదరాబాద్: అఖిలభారత పద్మశాలి సంఘం అధ్యక్షులు, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ నారాయణగూడ పద్మశాలి భవన్‌లో నిర్వహించిన పద్మశాలి ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా డా. కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ...“ప్రజాసేవలో ఉన్న పద్మశాలిల  ను,ప్రజాప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సన్మానించడం ఎంతో విశేషమైన కార్యక్రమం చాలా సంతోషంగా ఉందన్నారు. పద్మశాలి సమాజ అభివృద్ధికి ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. మన సమాజం నుంచి ప్రజాసేవలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ గౌరవించుకోవడం మన బాధ్యత అని వారన్నారు.“చేనేత, విద్య, ఉపాధి, వ్యాపారం, మహిళా సాధికారతతో పాటు యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడమే మన ముందున్న ప్రధాన లక్ష్యం అని,పద్మశాలి సమాజం ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం కావాలంటే అందరం ఐక్యంగా పనిచేయాలనీ అన్నారు. ప్రజాప్రతినిధుల సమక్షంలో చండూర్ మున్సిపల్  చైర్మన్ డా. కోడి శ్రీనివాసులను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కందగట్ల స్వామి, కమర్తపు మురళి,మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్,పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, చేనేత కార్పొరేషన్ చైర్మన్ దుడెం వెంకటరమణ, కుడా చైర్మన్ గుండు సుధారాణి, బీసీ కమీషన సభ్యులు రాపోలు జయప్రకాష్, చేనేత కార్పొరేషన్ వైస్ చైర్మన్ జక్కని అనిత, వివిధ జిల్లాల, ప్రాంతాలకు చెందిన మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, పద్మశాలి ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, చేనేత రంగ ప్రతినిధులు, మహిళా, యువజన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags: