హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుప్తకు ఏఎస్ఐగా పదోన్నతి
విశ్వంభర, షాబాద్: షాబాద్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్ గుప్త పదోన్నతి పొంది ఏఎస్ఐగా నియమితులయ్యారు. విధి నిర్వహణలో ఆయన అందించిన సేవలను గుర్తించి ఈ పదోన్నతి లభించింది.ఈ సందర్భంగా చేవెళ్ల ఏసీపీ కిషన్ గౌడ్ రమేష్ గుప్తకు ఏఎస్ఐ స్టార్‌ను అలంకరించి అభినందించారు. షాబాద్ ఎస్‌హెచ్‌ఓ డీకే లక్ష్మీరెడ్డి, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది రమేష్ గుప్తకు శుభాకాంక్షలు తెలిపారు.అలాగే షాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రమేష్ గుప్తను అభినందించారు. ఆర్యవైశ్య మహాసభ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం రమేష్ గుప్త, ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ పూర్ణచంద్ర గుప్త, రిపోర్టర్ శ్రీనివాస్ గుప్త, షాబాద్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సాయిరాం గుప్త తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.పదోన్నతి పొందిన రమేష్ గుప్త మరింత బాధ్యతగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించాలని వారు ఆకాంక్షించారు.



