పోలీస్ స్టేషన్‌లోనే నా పీఏ, పీఆర్వోలపై దాడి.. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు: కేటీఆర్

పోలీస్ స్టేషన్‌లోనే నా పీఏ, పీఆర్వోలపై దాడి.. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు: కేటీఆర్

  • అన్యాయంపై న్యాయపోరాటం చేస్తాం.. పోలీసుల తీరుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

KTR BRS: తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రతిపక్ష నేత కేసీఆర్ నివాసంపై దాడి చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నివాసంపై దాడిని అడ్డుకునేందుకు తాము వెళ్లగా పోలీసులు తమను పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమపై కూడా దాడికి ప్రయత్నించారని కేటీఆర్ ఆరోపించారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్‌లోనే తన పీఏ, పీఆర్వోలపై దాడి జరిగినప్పటికీ పోలీసులు కనీసం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ఆయన అన్నారు.

ఈ పరిణామాలు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. పోలీస్ స్టేషన్‌లోనే తమ సిబ్బందిపై దాడి జరిగినా ఫిర్యాదును స్వీకరించకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. ఈ అన్యాయంపై వెనక్కి తగ్గేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. జరిగిన పరిణామాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Read More సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి మంత్రి సీతక్క.. రాఖీ కట్టి స్వీట్‌ తినిపించిన మంత్రి