రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాలతో పాలచర్లలో కార్యక్రమం

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాలతో పాలచర్లలో కార్యక్రమం

  • పాలచర్లలో ‘నిజం గెలిచింది’ కొవ్వొత్తుల ప్రదర్శన

Anantapur News: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పాలచర్ల గ్రామంలో ‘నిజం గెలిచింది’ నినాదంతో కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన ఘటనకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా గ్రామంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు సంఘీభావంగా నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు.

Read More పుష్పశ్రీవాణి చీర లాగారంటూ ఆరోపణలు.. “సాటి మహిళ చీర లాగుతారా?”

చంద్రబాబు అరెస్టు సమయంలో టీడీపీ శ్రేణులు ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ‘నిజం గెలిచింది’ అనే నినాదంతో కొవ్వొత్తులు వెలిగించారు. చంద్రబాబుకు తమ మద్దతు ఎప్పటికీ కొనసాగుతుందని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రుద్దం ముత్యాలప్ప, మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎర్రి స్వామి, వడ్డే గోవిందు రాజు, మంగళ వేణు, కురవ శంకర, వడ్డే నాగరాజు, కురవ మహేష్, మంగళ శీన తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

Tags:  

Advertisement