ఇందిరమ్మ ఇంటికి రూ.5 లక్షలు సరిపోవడం లేదు.. నిధులు పెంచాలి: రాజగోపాల్ రెడ్డి

ఇందిరమ్మ ఇంటికి రూ.5 లక్షలు సరిపోవడం లేదు.. నిధులు పెంచాలి: రాజగోపాల్ రెడ్డి

  • ఇల్లు కట్టాలంటే రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఖర్చవుతోంది.. ఎమ్మెల్యే ఆవేదన

Komatireddy Rajagopal Reddy: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రభుత్వం అందిస్తున్న నిధులపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షలు ప్రస్తుత నిర్మాణ వ్యయాలకు సరిపోవడం లేదని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మరోసారి ఆలోచించి నిధులను పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఇల్లు నిర్మించుకోవాలంటే ప్రస్తుతం దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు అవుతోందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం అందించే రూ.5 లక్షలు ఇంటి నిర్మాణంలో మేస్త్రీ ఖర్చులకే సరిపోతున్నాయని అన్నారు. దీంతో పేద కుటుంబాలు మిగిలిన మొత్తాన్ని సమకూర్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు.

Read More ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి ఆస్తులపై ఏసీబీ ఫోకస్.. పలు చోట్ల సోదాలు

గ్రామాల్లో పేదలు ఇళ్ల నిర్మాణం కోసం అప్పులు తెచ్చుకుంటున్నారని, కొందరు తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్ముకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తాను చెబుతున్నది కేవలం రాజకీయ విమర్శ కాదని, గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్య అని స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలంటే ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని పెంచాలని రాజగోపాల్ రెడ్డి కోరారు. పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం నిర్మాణ వ్యయాలకు అనుగుణంగా నిధులను పెంచే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

Advertisement