TRS పార్టీ రంగారెడ్డి యూత్ ప్రెసిడెంట్ గా చంద్రకాంత్ కర్నాటి నియామకం
On
విశ్వంభర, హైదరాబాద్ :-తెలంగాణ రక్షణ సేన రంగారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడిగా చంద్రకాంత్ కర్నాటినీ నియమిస్తూ పార్టీ అధిష్టానం నియామక పత్రాన్ని విడుదల చేసింది. తెలంగాణ రక్షణ సేన పార్టీ నుండి గత కొంతకాలంగా పార్టీకి సేవలను అందిస్తూ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మార్గదర్శకత్వంలో నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న చంద్రకాంత్ కర్నాటి కి రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు గా ఎంపిక అవ్వడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద భాద్యతలు అప్పగించిన పార్టీ ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవిత కు కృతజ్ఞతలు తెలిపారు.



