మట్టి గణపతుల తయారీతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన*
విశ్వంభర – షాబాద్:షాబాద్ మండలం నాగర్‌గూడ గ్రామంలోని అక్షర టాలెంట్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు మట్టితో గణపతి విగ్రహాలను స్వయంగా తయారు చేసి, ప్రజలకు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ, నీటి కాలుష్య నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం తెలిపింది.రాబోయే రోజుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో నీటి కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని విద్యార్థులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా పండుగను నిర్వహించవచ్చని తెలిపారు.విద్యార్థుల్లో క్రమశిక్షణతో పాటు పర్యావరణ మార్పులు, నీటి సంరక్షణ, నీటి వినియోగంపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అక్షర టాలెంట్ స్కూల్ చైర్మన్ రాజు గౌడ్ తెలిపారు.కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



