టిమ్స్‌ ప్రారంభానికి సన్నాహాలు

టిమ్స్‌ ప్రారంభానికి సన్నాహాలు

విశ్వంభర, హైదరాబాద్‌: డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా త్వరలో ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు. శనివారం టిమ్స్‌ను పరిశీలించిన మంత్రి మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ప్రారంభం నుంచే అన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. టిమ్స్‌లో సూపర్‌ స్పెషాలిటీ, అత్యవసర వైద్యం, క్రిటికల్‌ కేర్‌, అవయవ మార్పిడి వంటి ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఆస్పత్రిలో మౌలిక వసతులు, వైద్యులు, సిబ్బంది, విద్యుత్‌, నీరు, పారిశుధ్యం, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో వైద్యం, విద్య, తాగునీరు, సంక్షేమం, రేషన్‌ కార్డుల పంపిణీపై అధికారులతో చర్చించారు. ఆస్పత్రుల్లో మందులు, పరికరాలు అందుబాటులో ఉంచాలని, సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నెల 15న సీఎం సంగారెడ్డి పర్యటన నేపథ్యంలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

🕒 09 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/preparations-for-the-start-of-tims/article-21248

Tags: