పారిశుద్ధ్యం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై సమీక్ష 

విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో  మండల పరిషత్ అభివృద్ధి అధికారి  జి. జలంధర్ రెడ్డి అధ్యక్షతన మండల స్థాయి సమీక్ష సమావేశం జరిగింది . ఈ సమావేశంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా,  డ్రెయిన్ , సోక్ పిట్స్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో చర్చించిన అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, పురోగతి నివేదికలను అత్యవసర ప్రాధాన్యతతో సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మండల పంచాయతీ అధికారి వై. ప్రేమలత , ఏఈ (పీఆర్)  జి. సందీప్ రెడ్డి , ఏఈ (ఆర్.డబ్లు.యస్.) శ్రీకీర్తి , ఈజీఎస్ ఈ సీ బీ పీ విక్రమ్ , ఏ ఈ హౌసింగ్ కిరణ్ , మండలంలోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-review-on-construction-of-sanitation-indiramma-houses/article-19393

Tags: