ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
- ఎన్టీఏ పరీక్షల అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరపాలి: ఎంసీపీఐ(సి) డిమాండ్
విశ్వంభర,కేసముద్రం : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని ఎంసీపీఐ(సి) జిల్లా కార్యదర్శి మరిపెళ్లి మొగిలి, జిల్లా కమిటీ సభ్యుడు జాటోత్ బిచ్యా నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం కేసముద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలే కారణమని విమర్శించారు. ఎన్టీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకల కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పూర్తిగా లోపించాయని ఆరోపించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విద్యా వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. పరీక్షల అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. విద్యా వ్యవస్థపై విశ్వాసం పునరుద్ధరించేలా తక్షణ చర్యలు చేపట్టడంతో పాటు పరీక్షల నిర్వహణలో సమూల సంస్కరణలు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే విద్యార్థి, ప్రజా సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.