సమాచార భవన్ కార్యాలయంలో ఘనంగా బోనాలు

సమాచార భవన్  కార్యాలయంలో ఘనంగా బోనాలు

విశ్వంభర, హైదరాబాద్ : సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్‌లోని సమాచార భవన్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సమాచార శాఖ ఉద్యోగుల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఉత్సవ ఊరేగింపు, బోనాల సమర్పణ, ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన ఉత్సవ ఊరేగింపులో డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, సాంప్రదాయ కళారూపాల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ సంచాలకులు ఎల్.ఎల్.ఆర్. కిషోర్ బాబు, అదనపు సంచాలకులు డి.ఎస్. జగన్, మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, జాయింట్ డైరెక్టర్లు డి. శ్రీనివాస్, కె. వెంకటరమణ, సి.ఐ.ఈ. రాధాకిషన్, డిప్యూటీ డైరెక్టర్లు సి. రాజారెడ్డి, ఆర్.ఐ.ఈ. జయ రామ్మూర్తి, సహాయ సంచాలకులు సత్యనారాయణ రెడ్డి, బిమల్ దేవ్, డిప్యూటీ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ నర్సింహా గౌడ్, అకౌంట్స్ ఆఫీసర్లు పద్మ, టీఎన్‌జీవోస్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీజీఓ అధ్యక్షుడు యేలూరి శ్రీనివాసరావు, టీఎన్‌జీవోస్ నాయకులు అనిల్, జితేందర్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

🕒 08 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-grand-bona-in-the-office-of-the-information-bhavan/article-21116

Tags:  

Advertisement