నాగబాబు ట్వీట్ పై స్పందించిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవి?

నాగబాబు ట్వీట్ పై స్పందించిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవి?

నాగబాబు ఇటీవల ట్విట్టర్ వేదికగా చేసినటువంటి ట్వీట్ ఎలాంటి వివాదాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఈయన సోషల్ మీడియా వేదికగా మా వాడు అయిన ప్రత్యర్థులకు పని చేసేవాడు మాకు పరాయి వాడే.

నాగబాబు ఇటీవల ట్విట్టర్ వేదికగా చేసినటువంటి ట్వీట్ ఎలాంటి వివాదాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఈయన సోషల్ మీడియా వేదికగా మా వాడు అయిన ప్రత్యర్థులకు పని చేసేవాడు మాకు పరాయి వాడే. ప్రత్యర్థులకు పని చేస్తూ మాతో ఉంటే మా వాడే అంటూ ఒక ట్వీట్ చేశారు. అయితే ఈయన ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారు అన్నది మాత్రం తెలియచేయలేదు. 

ఈ క్రమంలోనే కచ్చితంగా నాగబాబు ఈ ట్వీట్ అల్లుఅర్జున్ ని ఉద్దేశించి చేశారని పెద్ద ఎత్తున అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలియజేయకుండా నంద్యాల వెళ్లి తన స్నేహితుడు వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. 

Read More మరో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

 

ఈ విషయంపై శిల్పా రవి స్పందించారు ఒకవేళ నాగబాబు గారు ఈ ట్వీట్ బన్నీని ఉద్దేశించి చేశారు అంటే అది ఆయన సంస్కారానికి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. ఓటింగ్ రోజు కూడా బన్నీ చాలా క్లియర్ గా చెప్పాడు. నేను నా స్నేహితుడి కోసమే వెళ్లాను నాకు పార్టీలతో సంబంధం లేదు పవన్ కళ్యాణ్ కి కూడా నేను మద్దతు తెలిపానని వెల్లడించారు అయినప్పటికీ ఈయన బన్నీని అనే ఉంటే అది ఆయన సంస్కారానికి వదిలేస్తున్నానని తెలిపారు.