వివాహ వేడుకలో విషాదం.. డీజే వాహనం ఢీకొని ముగ్గురు మృతి

ఓ వివాహ వేడుకలో విషాదం మిగిలింది. డీజే వాహనం ఢీకొని ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది.

ఓ వివాహ వేడుకలో విషాదం మిగిలింది. డీజే వాహనం ఢీకొని ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే వ్యక్తి రాత్రి 10గంటల తర్వాత పాటలు ప్లే చేయడం మానేశాడు. 

దీంతో అతడికి పెళ్లికి వచ్చిన బంధువుల మధ్య గొడవ చెలరేగింది. పాటలు పెట్టాల్సిందేనని బంధువులు వాదించగా డీజే ఆపరేటర్ మాత్రం సమయం అయిపోయిందని వారితో చెప్పాడు. ఈ క్రమంలో అక్కడి నుంచి వెళ్లేందుకు డ్రైవర్ వాహనాన్ని వెనక్కి తిప్పడం ప్రారంభించాడు. దీంతో అడ్డగించబోయిన ఓ బాలిక, ఇద్దరు మహిళలు డీజే వాహనం చక్రాల కింద పడిపోయారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. 

Read More రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య 

వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా రమరతి (55) అనే మహిళ, రేష్మ (17), శాంత (30) చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటన అనంతరం స్థానికులు ఆగ్రహంతో డీజే వాహనానికి నిప్పుపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నామని బేతుల్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ కమలా జోషి వెల్లడించారు.

🕒 01 Jun 2024 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/tragedy-at-the-wedding-party-djs-vehicle-collided-and-three/article-1079

Advertisement

LatestNews

అమరావతి సమీపంలోని మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు
చెన్నైకి సీఎం చంద్రబాబు.. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు
సనత్‌నగర్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం