ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. అమ్మవారి అలంకారాల షెడ్యూల్ ఇదే

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. అమ్మవారి అలంకారాల షెడ్యూల్ ఇదే

  • అక్టోబర్ 11 నుంచి 20 వరకు దుర్గమ్మకు ప్రత్యేక అలంకారాలు

Indrakeeladri Dasara: విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించనున్న దసరా మహోత్సవాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 10 రోజుల పాటు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. దసరా మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు నిర్వహించనున్నారు. ఈ పది రోజుల పాటు ఇంద్రకీలాద్రి భక్తులతో సందడిగా మారనుంది.

అక్టోబర్ 11న బాలా త్రిపురసుందరీ దేవిగా, 12న గాయత్రీ దేవిగా, 13న అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 14న మహాచండీ దేవి, 15న లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబర్ 16న మూలానక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. దీంతో మూలానక్షత్రం రోజున ప్రత్యేక పూజలు, దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.

Read More ఘనంగా శ్రీ జగన్నాథ రథోత్సవం 

అక్టోబర్ 17న మహాలక్ష్మీ దేవిగా, 18న దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 19న మహర్నవమి సందర్భంగా మహిషాసుర మర్ధిని దేవి అలంకారంలో, అక్టోబర్ 20న విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు కొలువుదీరనున్నారు. దసరా మహోత్సవాల షెడ్యూల్ విడుదల కావడంతో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపట్టనున్నారు.

దసరా అలంకారాల షెడ్యూల్:

అక్టోబర్ 11 – బాలా త్రిపురసుందరీ దేవి
అక్టోబర్ 12 – గాయత్రీ దేవి
అక్టోబర్ 13 – అన్నపూర్ణాదేవి
అక్టోబర్ 14 – మహాచండీ దేవి
అక్టోబర్ 15 – లలితా త్రిపుర సుందరీ దేవి
అక్టోబర్ 16 – సరస్వతీ దేవి (మూలానక్షత్రం)
అక్టోబర్ 17 – మహాలక్ష్మీ దేవి
అక్టోబర్ 18 – దుర్గాదేవి (దుర్గాష్టమి)
అక్టోబర్ 19 – మహిషాసుర మర్ధిని దేవి (మహర్నవమి)
అక్టోబర్ 20 – రాజరాజేశ్వరి దేవి (విజయదశమి)

Related Posts