ఏపీలో పోలింగ్ నాటికి ముందస్తు జాగ్రత్తలు .. 20 మందిపై రౌడీషీట్లు
ఏపీలో పోలింగ్ రోజు నుంచి జరిగిన అల్లర్లతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో గాలింపు చర్యలు వేగవంతం చేశారు. అల్లర్లకు పాల్పడుతున్న వారిపై చార్జ్‌షీట్‌లు బుక్ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిపై పీడీ యాక్ట్ అమలు చేశారు.
ఒకరికి నగరం నుంచి బహిష్కరించారు. ఇక 20 మందిపై రౌడీషీట్లు, 55 మందిపై సస్పక్ట్ షీట్లు నమోదు చేశారు. 14 మందిని అరెస్ట్ చేశారు. ఇంకో నలుగురికి సీఆర్‌పీసీ నోటీసుల ఇచ్చారు. అల్లర్లు చేస్తారనే అనుమానం ఉన్నవారిని పోలీసులు బైండోవర్ చేస్తున్నారు. జూన్ 4 కంటే ముందు అల్లర్లను ప్రేరేపించేవాళ్లందరిని సైడ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఫలితాలు వెల్లడి రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఇప్పటి వరకూ 183 వాహనాలు,130 ఫోన్లు, భారిగా మధ్యం స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. రిజల్ట్స్ వచ్చిన రోజు ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు రద్దు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా విక్రయాలపై నిషేధం విధించారు. మరోవైపు అధికారులు కూడా ఏ పార్టీకి అనుకూల వైఖరి తీసుకోకుండా ఈసీ అప్రమత్తం అయింది. అందులో భాగంగా మాచర్ల ఘటనలో పోలింగ్ సిబ్బందిపై చర్యలు మొదలు పెట్టారు. పాల్వాయి గేట్ పోలింగ్ గేట్ కేంద్రంలో విధులు నిర్వహించిన పీవోపై సస్పెన్షన్ వేటు పడింది.