చంద్రబాబు కుప్పం పర్యటనలో ఆసక్తికర సంఘటన
On
చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మొదటిసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటుకుప్పంలో పర్యటించారు. ఎనిమిదో సారి ఆయన కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో కుప్పం ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు సీఎం హోదాలో మొదటిసారి ఆయన కుప్పంకు బయలు దేరారు.
అయితే ఆయన పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కుప్పంలో చంద్రబాబు ప్రజలతో మమేకం అయ్యారు. ప్రజలను ఆప్యాయతతో పలకరించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలతో కలిసిపోయారు. అయితే ఓ తల్లిదండ్రులు తమ పసిపాపను చంద్రబాబు వద్దకు తీసుకొచ్చారు.
Read More రెండో రోజు దావోస్‌లో సీఎం చంద్రబాబు
తమ పాపకు పేరుపెట్టాలంటూ కోరారు. ఆ పాపను చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆమెకు ‘చరణి’ అని పేరు పెట్టారు. దాంతో స్వయంగా సీఎం తమ కూతురుకు పేరు పెట్టడంతో ఆ తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు.