గుడుంబా,మద్యం వ్యాపారి నెటుల శోభారాణిపై పీడీ యాక్ట్.
ఛత్రినాక ఇన్స్పెక్టర్ ఎస్. కోటేశ్వర్ రావు వెల్లడి.
విశ్వంభర, హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా అక్రమ మద్యం/గుడుంబా విక్రయాలకు పాల్పడుతున్న, అలవాటుపడిన నేరస్థురాలు నెటుల శోభారాణి అలియాస్ లలితపై పి.డి. యాక్ట్ (ప్రివెంటివ్ డిటెన్షన్) కింద చర్యలు తీసుకున్నట్లు ఛత్రినాక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్. కోటేశ్వర్ రావు తెలిపారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్, ఉప్పుగూడ, లలితాబాగ్ ప్రాంతానికి చెందిన నెటుల శోభారాణి @ లలిత (50), భర్త సుశీల్ కుమార్, సుదీర్ఘకాలంగా అక్రమ మద్యం దందాకు పాల్పడుతోంది. ఈమెపై హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో మొత్తం 33 కేసులు నమోదయ్యాయి. గతంలో పలు కేసులు పెట్టి, ముందస్తు నిరోధక చర్యలు చేపట్టినప్పటికీ ఆమె తన వైఖరిని మార్చుకోకుండా అక్రమ వ్యాపారాన్ని కొనసాగించింది. ఇటీవల అతి తక్కువ కాలంలోనే మళ్లీ 7 కేసుల్లో నిందితురాలిగా తేలడం ఆమె నేర స్వభావానికి నిదర్శనమని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.బైండ్ ఓవర్ నిబంధనల ఉల్లంఘన: సత్ప్రవర్తన కోసం స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, హైదరాబాద్ ముందు ఈమెను రెండుసార్లు (17.10.2023 మరియు 23.05.2025 తేదీలలో) బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అయినప్పటికీ బైండ్ ఓవర్ గడువు ముగియక ముందే మళ్లీ నేరాలకు పాల్పడి నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించింది. దీంతో ఆమె సమర్పించిన రూ. 15,000 మరియు రూ. 20,000 పూచీకత్తు సొమ్మును ప్రభుత్వం జప్తు (Forfeited) చేసింది.పదే పదే చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్నందున, కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్ గారు జారీ చేసిన పి.డి. యాక్ట్ ఉత్తర్వుల మేరకు 17.08.2026న ఛత్రినాక పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తగిన పత్రాలను అందజేసి, చంచల్‌గూడ మహిళా సెంట్రల్ జైలుకు తరలించారు. అక్రమ మద్యం వ్యాపారానికి పాల్పడేవారు ఎన్నిసార్లు కేసులు నమోదైనా వైఖరి మార్చుకోకపోతే వారిపై ఇలాంటి కఠినమైన పి.డి. యాక్ట్ చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.