మంత్రి సీతక్కను కలిసిన పద్మశాలి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ల చైర్మన్లు
ఆధార్ పెన్షన్లకు వయసు సడలింపు కోరిన గూడూరు శ్రీనివాస్, దూడెం వెంకటరమణ.
విశ్వంభర, హైదరాబాద్:- ఆధార్ ఆధారిత పెన్షన్లకు సంబంధించి అర్హత వయసులో సడలింపు కల్పించాలని కోరుతూ తెలంగాణ పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ రాష్ట్ర మంత్రి సీతక్కను తెలంగాణ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా చైర్మన్లు మాట్లాడుతూ, వయసు నిబంధనల కారణంగా అర్హత ఉన్న పలువురు వృద్ధులు పెన్షన్ ప్రయోజనాలను పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి సీతక్క దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా చేనేత, పద్మశాలి వర్గాలకు చెందిన పేదలు, వృద్ధులు మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు పెన్షన్ ఎంతో అవసరమని వివరించారు.ప్రస్తుత వయసు అర్హత నిబంధనలను పరిశీలించి, అర్హులైన వారికి పెన్షన్ అందేలా వయసు సడలింపు కల్పించాలని చైర్మన్లు మంత్రి సీతక్కను కోరారు. ఈ అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.చైర్మన్ల విజ్ఞప్తిని మంత్రి సీతక్క సానుకూలంగా విని, సమస్యను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.