శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..

  • నర్సరీ నుంచి టెన్త్ వరకు పుస్తకాల విక్రయాలు.. అధికారులు ఏం చేస్తున్నారు?

Anantapuram Sri Chaitanya School: అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆదిమూర్తి నగర్‌లో ఉన్న శ్రీ చైతన్య సిక్స్త్ బ్రాంచ్‌లో పుస్తకాల విక్రయాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నర్సరీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయించి, వాటిని విద్యార్థుల ఇళ్లకు, పాఠశాలకు లేదా ఉపాధ్యాయుల ఇళ్లకు తెప్పించి అక్కడి నుంచి విద్యార్థులకు అందజేస్తున్నారని కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి మెటా యాప్ పేరుతో సుమారు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఒకటో తరగతి చదువుతున్న చిన్నారికి ఫోన్, మెటా యాప్‌తో ఏం పని ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల అవసరాల పేరుతో అదనపు యాప్‌లు, పుస్తకాలు, ఇతర సామగ్రిని తప్పనిసరి చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. పుస్తకాలు, యూనిఫాం, బెల్టులు తదితర వస్తువులను పాఠశాలలే విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతించిందా? అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. పుస్తకాల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Read More అనంతపురం ఆర్యవైశ్య సంఘ సమావేశంలో ఉద్రిక్తత.. సభ్యుల మధ్య వర్గ విభేదాలు

ఈ వ్యవహారంపై గతంలో కూడా పలు పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనంతపురం ఎంఈఓ, డీఈఓ అధికారులు స్పందించి పాఠశాలలో జరుగుతున్న పుస్తకాలు, ఇతర విద్యా సామగ్రి విక్రయాలపై సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై దృష్టి సారించి సంబంధిత పాఠశాలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

🕒 18 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/when-sri-chaitanya-used-to-take-measures-to-steal-books/article-21803

Advertisement

LatestNews

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి