కార్మికుల ప్రాణాలకు రక్షణ ఏది?.. బిస్మి ఇండస్ట్రీపై రాధాకృష్ణ, కలెక్టర్ స్పందించేదెప్పుడు?

నెల రోజుల్లోనే మరో కార్మికుడికి పాముకాటు.. బిస్మి ఇండస్ట్రీపై కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదు?

Bismi Industries: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లి గ్రామ సమీపంలోని బిస్మి ఇండస్ట్రీకి చెందిన ఎంఎస్ ప్లైవుడ్ ఫ్యాక్టరీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. గత ఘటన మరువకముందే సుమారు నెల రోజుల వ్యవధిలోనే మరో కార్మికుడికి పాముకాటు ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుడు పాముకాటుకు గురికావడంతో అనంతపురం సర్వజన ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపినట్లు సమాచారం. అయితే చికిత్స అనంతరం ఎలాంటి రిపోర్టు తీసుకోకుండానే ఆసుపత్రి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఒకవైపు ఫ్యాక్టరీలో కార్మికుల భద్రతపై వరుసగా ప్రశ్నలు తలెత్తుతుండగా, మరోవైపు మరో కార్మికుడికి పాముకాటు ఘటన వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటికే బిస్మి ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలపై పత్రికల్లో కథనాలు వెలువడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో ఎంఎస్ ట్రేడర్స్‌లో కూలీ మృతి ఘటన చోటుచేసుకోగా, తాజాగా మరో కార్మికుడికి పాముకాటు ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంత జరుగుతున్నా ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి? కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఫ్యాక్టరీకి అవసరమైన అనుమతులు ఉన్నాయా? అధికారులు తనిఖీలు నిర్వహించినా వాటి ఫలితం ఏమిటి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఫ్యాక్టరీ కమిషనర్ రాధాకృష్ణ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? తనిఖీల్లో ఏం గుర్తించారు? నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

Read More రోడ్లు లేని గ్రామాలకు సైకిళ్లు ఎందుకు ఎమ్మెల్యే సార్?.. ఎర్రడికేర వాసుల ఆగ్ర‌హం..

మరోవైపు ఈ వ్యవహారంపై ఫ్యాక్టరీ కమిషనర్ రాధాకృష్ణను కలిసేందుకు రిపోర్టర్లు ప్రయత్నించగా, ఆయన రేపు రా అంటూ రిపోర్టర్లను కలవకుండా వ్యవహరించినట్లు సమాచారం. కార్మికుల ప్రాణాలకు సంబంధించిన అంశంపై అధికారులు వెంటనే స్పందించాల్సి ఉండగా, ఇలా రేపు రా అంటూ తప్పించుకోవడం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుమారు నెల రోజుల వ్యవధిలోనే మరో వ్యక్తికి పాముకాటు ఘటన జరగడంతో బిస్మి ఇండస్ట్రీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇన్ని రోజులుగా ఈ ఫ్యాక్టరీపై కథనాలు వస్తున్నప్పటికీ ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదని స్థానికులు, కార్మికుల తరఫున మాట్లాడుతున్న వారు ప్రశ్నిస్తున్నారు. వరుస ఘటనలు జరుగుతున్నా చర్యలు ఎందుకు కనిపించడం లేదని నిలదీస్తున్నారు. మరో ఘటన జరిగే వరకు అధికారులు వేచి చూస్తున్నారా? కార్మికుల ప్రాణాలకు ముప్పు ఉందన్న ఆరోపణలపై ఇప్పటికైనా సమగ్ర తనిఖీ నిర్వహించి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీ కమిషనర్ రాధాకృష్ణతో పాటు జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై వెంటనే స్పందించి, ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు, అనుమతులు, కార్మికుల రక్షణ చర్యలపై సమగ్ర విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

🕒 19 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/-draft--add-your-title/article-21815

Tags:  

Advertisement

LatestNews