శ్రీ వాగ్దేవి జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
విశ్వంభర, జి హెచ్ ఎం సి: శ్రీ వాగ్దేవి జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల చైర్మన్ సిద్ధల బీరప్ప గారు మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పండుగ ప్రత్యేకతను వివరించారు. బోనం సమర్పణ వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని, ఈ పండుగను ఎందుకు జరుపుకుంటామో విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థినీ విద్యార్థులు పోతురాజు, పొట్టేలు, అమ్మవారి వేషధారణలతో బోనాల సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. తలపై బోనాలను మోస్తూ అమ్మవారికి నైవేద్యం సమర్పించి భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని అట్టహాసంగా కొనసాగించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ పోలొజు రవికుమార్ చారి, తిప్పర్తి నరసింహారెడ్డి, ప్రిన్సిపాల్ రవీందర్ తో పాటు అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కళాశాలలో ఇలాంటి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో సాంస్కృతిక స్పృహ పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.