కాసం లక్ష్మారెడ్డికి ఘనంగా  నివాళులు 

కాసం లక్ష్మారెడ్డికి ఘనంగా  నివాళులు 

విశ్వంభర, నెల్లికుదురు: కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు విశేష సేవలు అందించిన నిను మరువలేం అంటూ ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్, డిసిసి అధ్యక్షురాలు డా.ఉమా మురళి నాయక్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ డిసిసి జనరల్ సెక్రటరీ స్వర్గీయ కాసం లక్ష్మారెడ్డికి ఘన నివాళులర్పించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన యువ ప్రజా నేత కాసం లక్ష్మారెడ్డి ఇటీవల అనారోగ్యంతో అకస్మాత్తుగా కన్నుమూశారు. ఆయన స్వగ్రామం రామన్నగూడెంలో శనివారం దశదినకర్మ, సంతాప సభ జరిగింది. దీనికి వారు హాజరై డిసిసి మాజీ అధ్యక్షులు భరత్ చంద్ర రెడ్డి, రాష్ట్ర నేత అయ్యప్ప రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డి, కాసం రంజిత్ రెడ్డి,ఆకుతోట సతీష్, రావుల సతీష్ ప్రభృతులతో కలిసి లక్ష్మారెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. సంతాప సభలో ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు,బలోపేతం కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప యువ నాయకుని కోల్పోయామని లక్ష్మారెడ్డి లేని లోటు పార్టీకి తీరనిదన్నారు. ఎంతో భవిష్యత్తు కలిగిన ప్రజా నాయకుడు లచ్చన్న కన్నుమూత బాధాకరమని రవిచారం వ్యక్తం చేశారు. సీనియర్ నేత కాసం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం ఆయన పేరున మినరల్ కాల్ చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి తో పాటు పలువురు భావోద్వేగానికి లోనయ్యారు.కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులతో పాటు వివిధ పార్టీల నాయకులు సత్యపాల్ రెడ్డి,హెచ్ వెంకటేశ్వర్లు,బైరు అశోక్ గౌడ్,ప్రభాకర్ గౌడ్,బాలాజీ నాయక్, చందు రాజ్ కుమార్ యాదవ్,కాసం వెంకటేశ్వర రెడ్డి,మదన్ లాల్,చీకటి జగదీష్ గౌడ్,బాలు నాయక్,సుందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

🕒 09 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tributes-to-kasam-lakshmareddy/article-21297

Tags:  

Advertisement

LatestNews

ఆర్యభట్ట స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
భార్య ప్రైవేట్‌ ఫొటోలతో భర్త బ్లాక్‌మెయిల్‌.. ఫిలింనగర్‌లో కేసు
తాడిపత్రిలో అరాచకాలపై చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు మౌనం?: కేతిరెడ్డి పెద్దారెడ్డి
సెట్టూరు ఎస్సీ వసతిగృహంలో విద్యార్థి మృతి..ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదు?
ఎం.ఎస్. ప్లైవుడ్ ఫ్యాక్టరీ కార్మిక‌ ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు.. కలెక్టర్ గారూ ఇదేం తీరు..
శ్రీ సంతోషి మాత వార్షికోత్సవంలో పాల్గొన్న  పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్
టీటీడీ చైర్మన్‌ను కలిసిన గూడూరు శ్రీనివాస్, చరణ్ కౌశిక్ యాదవ్