బీజేవైఎం నిర్వహిస్తున్న మహా ధర్నాకు యువమోర్చ నాయకులతో కలిసి జండా ఊపి బయలుదేరిన శ్రీవర్ధన్ రెడ్డి
విశ్వంభర న్యూస్ షాద్ నగర్ : - నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చమని ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఈరోజు ధర్నా చౌక్ దగ్గర బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా ధర్నా కార్యక్రమానికి షాద్ నగర్ నియోజకవర్గం నుండి బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్యాట అశోక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీజేవైఎం నాయకులు బయలుదేరడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి పాల్గొని జండా ఊపి, బీజేవైఎం నాయకులతో కలిసి ధర్నాకు బయలుదేరారు.
వారితో పాటు రణధీర్ గౌడ్ ,బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ పుట్నాల సాయి కుమార్ ,సందీప్ యాదవ్,ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు కాని ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి ,గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులను, మహిళలను,పేద ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.
నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగులు ఆత్మ బలిదాణమై తెచ్చుకున్న తెలంగాణా లో గతం లో కెసిఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని,ఇప్పుడు రేవంత్ సర్కార్ మోసం చేస్తుందని అన్నారు.బీజేవైఎం న్యాయమైన డిమాండ్ లు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని,గ్రూప్ - 2, గ్రూప్ - 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని,25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలి. ప్రస్తుత డీఎస్సీ పరీక్ష తేదీలను పోస్టుపోన్ చేసి నూతన తేదీలను ప్రకటించాలని,అన్ని నియామకాల్లో మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్ కేటాయించాలని ,పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జి ఓ నెం . 46ను వెంటనే రద్దు చేయాలని అదేవిదంగా జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని అన్నారు.
ఈ సందర్బంగా
ప్యాట అశోక్ మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని అబద్దపు హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన తరువాత రేవంత్ సర్కార్ నిరుద్యోగులను నిండా ముంచిందని అన్నారు.
ఎంతో మంది యువత ఆత్మ బలిదానమైతే తెలంగాణా రాష్ట్ర ఏర్పడ్డదని,మరి తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు.న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు బీజేపీ ఉద్యమం ఆగదని, నిరుద్యోగ యువత బీజేవైఎం అండగా ఉంటుందని ధీమా వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమం లో సుబ్రహ్మణ్యం ,సాయి గౌడ్ ,మల్లేష్ ,గట్టొజు విజయ్, పరమళ్ళ యాదయ్య, మణికంఠ ,శ్రీశైలం ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.