రోడ్డు భద్రతపై రాజీ లేదు

రోడ్డు భద్రతపై రాజీ లేదు

  • హైవేలపై అక్రమ పార్కింగ్, ఆక్రమణల తొలగింపునకు డెడ్‌లైన్: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

విశ్వంభర, సూర్యాపేట: రోడ్డు ప్రమాదాల్లో ప్రతి ప్రాణం అమూల్యమని, రహదారి భద్రత విషయంలో ఇకపై ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులపై వ్యక్తిగత బాధ్యతతో పాటు భారీ జరిమానాలు, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజస్థాన్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించిన నేపథ్యంలో కలెక్టరేట్‌లో రవాణా, రెవెన్యూ, పోలీస్, వైద్యం, విద్య, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ, నేషనల్ హైవే శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ రోడ్లపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను 45 రోజుల్లో గుర్తించి, నాలుగు నెలల్లో అక్కడ హై-ఇంటెన్సిటీ ఎల్‌ఈడీ లైట్లు, స్పీడ్ కెమెరాలు, రెట్రో రిఫ్లెక్టివ్ బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టాలని సూచించారు. జాతీయ రహదారులపై మెయిన్ రోడ్డు, షోల్డర్లపై భారీ వాహనాల పార్కింగ్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. వాహనాలను కేవలం నిర్దేశిత లే-బేలు లేదా పెట్రోల్ బంకుల వద్ద మాత్రమే నిలిపివేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ-చలానాలు, జీపీఎస్ ఆధారిత ఆధారాలతో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైవేల పక్కన అక్రమంగా ఏర్పాటైన దాబాలు, హోటళ్లు, ఇతర నిర్మాణాలను తొలగించాలని, కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని ఆదేశించారు. ఇప్పటికే ఇచ్చిన అనుమతులను 30 రోజుల్లో సమీక్షించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, డ్రోన్ సర్వేల ద్వారా ఆక్రమణలను గుర్తించి తొలగించాలని సూచించారు. రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందేలా ప్రతి 75 కిలోమీటర్లకు ఒక బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని, ట్రామా కేర్ కేంద్రాల ద్వారా రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్డు భద్రత చర్యల అమలుపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తామని, ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టికల్-21 ప్రకారం పౌరుల జీవించే హక్కును పరిరక్షించడం అధికారుల తొలి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో ప్రేమ్‌రాజ్, డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఆర్టీవో పురుషోత్తం రెడ్డి, డీపీవో యాదగిరి, ఆర్‌అండ్‌బీ ఈఈ సీతారామయ్య, డీఈవో అశోక్, మున్సిపల్ కమిషనర్లు, నేషనల్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు.

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/no-compromise-on-road-safety/article-19376

Tags: