ద్రవిడ భావన ద్వేషానికి కాదు: ప్రకాశ్‌రాజ్‌

  • ‘ద్రవిడ–వివక్షపై దక్షిణ స్వరం’ పుస్తకావిష్కరణ

విశ్వంభర, బాగ్‌లింగంపల్లి: ద్రవిడ భావన ఇతరులను ద్వేషించేది కాదని, దక్షిణాది భాషలు, సంస్కృతి, చరిత్ర, స్వాభిమానాన్ని గౌరవించుకోవడమేనని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మల్లీశ్వరి, కాత్యాయనీ విద్మహే సంపాదకత్వంలో రూపొందిన ‘ద్రవిడ–వివక్షపై దక్షిణ స్వరం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ భారతదేశ బలం ఏకరూపతలో కాకుండా వైవిధ్యంలో ఉందన్నారు. అన్ని భాషలు, సంస్కృతులకు సమాన గౌరవం కల్పించాలని సూచించారు. డీలిమిటేషన్‌ కారణంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకుండా చూడాలని కోరారు. చక్రపాణి మాట్లాడుతూ పుస్తకంలో భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, సమకాలీన రాజకీయ అంశాలను చర్చించారని తెలిపారు. భారతీయత అంటే ఏకరూపత కాదని, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు.

🕒 09 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/prakashraj-is-not-a-dravidian-spirit-of-hatred/article-21250

Tags: