ఎస్ ఐ ఆర్ లో ప్రతి ఒక్క ఓటరు నమోదు చేసుకోవాలి
- కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామాలలో ప్రజలకు వివరించాలి
సంగారెడ్డి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు ప్రవీణ్ యాదవ్
విశ్వంభర, పెద్ద శంకరంపేట: ఎస్ ఐ ఆర్ లో ప్రతి ఒక్క ఓటరు తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు ప్రవీణ్ యాదవ్, సంగారెడ్డి జిల్లా బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కోణం విఠల్ లు అన్నారు. బుధవారం పెద్ద శంకరంపేటలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో తప్పనిసరిగా ప్రతి ఓటరు తమ పేరును ఎస్ఐఆర్ లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వివరించాలన్నారు. ఎన్ డి ఏ ఆధ్వర్యంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు సాగుతుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ పటిష్టతకు కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని పేర్కొన్నారు. తెలంగాణలో సైతం రాబోయే ఎన్నికల్లో డబుల్ ఇంజన్ సర్కార్ బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు మహిళలు సైతం బిజెపి వైపు చూస్తున్నారని వివరించారు.ఈ కార్యక్రమంలో పెద్ద శంకరంపేట మండల బిజెపి అధ్యక్షుడు శ్రావణ్ కుమార్. ప్రధాన కార్యదర్శి ఎం కృష్ణ. బిజెవైఎం అధ్యక్షుడు బుగుడాల కృష్ణ. బిజెపి నాయకులు శంకర్రావు. సుకుమార్. ఎర్ర శ్రీహరి. భూషణం. నర్సింలు. అంజయ్య. ఆయా గ్రామాల బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.