మృతుడి కుటుంబానికి చేయూత

మృతుడి కుటుంబానికి చేయూత

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, జనంపల్లి గ్రామానికి చెందిన అవుల రమేష్ గత నెల 20న గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో భార్య వెంకటమ్మ, ముగ్గురు ఆడపిల్లలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్తిపాస్తులు లేకపోవడంతో రేకుల ఇంట్లో నివసిస్తూ గంగిరెద్దులతో జీవనం సాగిస్తున్నారు. కుటుంబ పరిస్థితిని గ్రామ మాజీ సర్పంచ్ పోషబోయిన మల్లేశం, మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఫౌండేషన్ ముఖ్య సభ్యులు నీలం శేఖర్ మృతుడు అవుల రమేష్ కుటుంబానికి 50 కేజీల బియ్యం, 14 రకాల నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా నీలం శేఖర్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం మానవత్వానికి నిదర్శనమన్నారు. ముగ్గురు ఆడపిల్లల చదువులు మధ్యలో ఆగిపోకుండా అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటివరకు సుమారు 2,000 కుటుంబాలకు రూ.40 లక్షల మేర సహాయం అందించినట్లు పేర్కొన్నారు. సుమారు 1,000 మంది సభ్యుల సహకారంతో కుటుంబ పెద్దలను కోల్పోయిన కుటుంబాలకు ఫౌండేషన్ అండగా నిలుస్తోందన్నారు. ఇప్పటివరకు 17 కుటుంబాలకు జీవనోపాధి కల్పించేలా సహకారం అందించినట్లు తెలిపారు. నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి, విద్యార్థుల చదువులకు భరోసా కల్పించడం ఫౌండేషన్ లక్ష్యమన్నారు. ముగ్గురు ఆడపిల్లల భవిష్యత్తు కోసం దాతలు, మానవతావాదుల సహకారంతో నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వేముల సైదులు, బాదే చంద్రశేఖర్, ఈదులకంటి శివకుమార్, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

🕒 09 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/aid-to-the-family-of-the-deceased/article-21285

Tags:  

Advertisement

LatestNews

శ్రీ సంతోషి మాత వార్షికోత్సవంలో పాల్గొన్న  పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్
టీటీడీ చైర్మన్‌ను కలిసిన గూడూరు శ్రీనివాస్, చరణ్ కౌశిక్ యాదవ్
నాలుగు రోజులైనా చర్యలు శూన్యం.. ఆ మహిళా ఉద్యోగిని కాపాడుతున్నదెవరు?
ఉచిత బర్త్, డెత్ సర్టిఫికెట్లకు రూ.40 వసూలు.. అనంతపురం మున్సిపల్ ఆఫీస్‌లో కలకలం
యాదాద్రి ఫార్మాలో పేలిన రియాక్టర్.. 10 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల.. మాట మీద నిలబడాలి. -మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు
22ఏ భూముల నిబంధన దుర్వినియోగం అవుతోంది: నారాయణ