108 లో ప్రసవం..తల్లీ బిడ్డ క్షేమం
సిబ్బంది ప్రభాకర్ వెంకన్న లకు అభినందన
On
విశ్వంభర,ఇనుగుర్తి: సిబ్బంది సహకారంతో 108 అంబులెన్స్ లో ప్రసవం జరిగి తల్లీ,బిడ్డ క్షేమంగా ఉన్న ఘటన మానుకోట జిల్లా ఇనుగుర్తి మండలం లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఇనుగుర్తి మండలం పెద్దతండకు చెందిన నూనావతు యాకమ్మ (36)కు ఆదివారం ఉదయం పురుటి నొప్పులు వచ్చాయి. ఆస్పత్రికి వెళ్లడానికి కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ సిబ్బందికి కాల్ చేశారు.ఓవైపు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే 108 సిబ్బంది ఈఎంటి ఎలమాద్రి ప్రభాకర్,పైలట్ పప్పుల వెంకన్న ల సహకారంతో యాకమ్మ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది.తల్లిబిడ్డలు క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.కాగా తల్లి బిడ్డలను వైద్య పరీక్షల కోసం మానుకోట ఏరియా ఆసుపత్రి కి తరలించగా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సరైన ప్రసవ సమయంలో వైద్య సహాయం అందించిన ఈఎంటి ప్రభాకర్,పైలట్ పప్పుల వెంకన్నలను కుటుంబ సభ్యులు బంధువులు అభినందించారు.
🕒 07 Sep 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/108-in-the-prazva-childs-well-being/article-6427