విశాఖ వాసులకు పండగే.. రాత్రి పడుకుంటే ఉదయానికి బెంగళూరులోనే
బెంగళూరు ప్రయాణికులకు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. వారంలో 6 రోజులు వందే భారత్ స్లీపర్ రైలు!
Vande Bharat Sleeper: విశాఖపట్నం-బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలును ప్రవేశపెట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCOR) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ రైలును ప్రారంభించే అంశంపై సంబంధిత జోన్లు, డివిజన్ల నుంచి ఫీజిబిలిటీ నివేదికలను కోరినట్లు సమాచారం. ప్రయాణికుల రద్దీ, ట్రాక్ లభ్యత, నిర్వహణ సౌకర్యాలు, సమయ పట్టిక వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. ప్రతిపాదన ప్రకారం, ఈ రైలును మంగళవారం మినహా వారంలో ఆరు రోజుల పాటు నడిపేలా ప్రాథమిక షెడ్యూల్‌ను రూపొందించారు.
ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం, విశాఖపట్నం నుంచి రాత్రి 8:15 గంటలకు బయలుదేరే ఈ వందే భారత్ స్లీపర్ రైలు మరుసటి రోజు ఉదయం 10 గంటలకు బెంగళూరుకు చేరుకునేలా సమయాలను సిద్ధం చేశారు. తిరుగు ప్రయాణానికి సంబంధించిన షెడ్యూల్‌పైనా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను ఇతర రైల్వే జోన్లు, డివిజన్లకు పంపించి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
ఈ రైలుకు రెండు మార్గాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొదటి మార్గం నెల్లూరు–తిరుపతి మీదుగా ఉండగా, రెండో మార్గం గుంటూరు–ధర్మవరం మీదుగా ప్రతిపాదించారు. ప్రయాణికుల డిమాండ్, ట్రాఫిక్, ఆపరేషనల్ సౌలభ్యం ఆధారంగా తుది మార్గాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. ఈ రైలు ప్రారంభమైతే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు బెంగళూరుతో మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన రైలు అనుసంధానం లభించనుంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, వైద్య సేవల కోసం ప్రయాణించే వారికి ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
అయితే ప్రస్తుతం ఇది కేవలం ప్రతిపాదన దశలో మాత్రమే ఉంది. సంబంధిత జోన్లు, డివిజన్ల నుంచి ఫీజిబిలిటీ నివేదికలు వచ్చిన అనంతరం రైల్వే బోర్డు పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. బోర్డు ఆమోదం లభించిన తర్వాతే విశాఖ–బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనుంది. దీంతో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుందా లేదా అనే అంశంపై ప్రయాణికుల్లో ఆసక్తి నెలకొంది.