జనాభా తగ్గించమన్నది నేనే.. ఇప్పుడు పెంచమంటున్నదీ నేనే: చంద్రబాబు

జనాభా తగ్గించమన్నది నేనే.. ఇప్పుడు పెంచమంటున్నదీ నేనే: చంద్రబాబు

  • జనాభా విషయంలో ఇది ఒక చరిత్ర.. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

Chandrababu Naidu: జనాభా పెరుగుదలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో జనాభాను తగ్గించాలని తానే చెప్పానని, ఇప్పుడు జనాభాను పెంచుకోవాలని కూడా తానే చెబుతున్నానని అన్నారు. కాలానుగుణంగా జనాభా విషయంలో ప్రభుత్వాల ఆలోచనా విధానాలు మారాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

ఒకప్పుడు జనాభా నియంత్రణ కోసం ప్రజలకు అవగాహన కల్పించామని చంద్రబాబు గుర్తు చేశారు. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడం ద్వారా జనాభా పెరుగుదలను తగ్గించేందుకు అప్పట్లో చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆ సమయంలో జనాభా నియంత్రణ అవసరంగా భావించామని పేర్కొన్నారు.

Read More దివంగత సీఎం వైఎస్సార్ వర్ధంతి.. ఇడుపులపాయలో జగన్ నివాళులు

అయితే ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయని చంద్రబాబు అన్నారు. జనాభా తగ్గిపోవడం భవిష్యత్తులో అనేక సమస్యలకు దారితీసే అవకాశం ఉందని, యువత సంఖ్య తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జనాభా సమతుల్యతపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని సూచించారు.

“జనాభా తగ్గించమన్నది నేనే.. పెంచమని చెప్తుందీ నేనే.. ఇదొక చరిత్ర” అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాలానికి అనుగుణంగా నిర్ణయాలు, విధానాలు మారడం సహజమని ఆయన చెప్పుకొచ్చారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని జనాభా విషయంలో సరైన విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.