నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ(సోమవారం) ప్రత్యేక విమానంలో మధ్యప్రదేశ్ సీఎం రమేష్‌తో కలిసి ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్నారు. అక్కడి నుంచి అనకాపల్లి గవరపాలెం నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి సతీసమేతంగా హాజరైన సంగతి తెలిసిందే. ఇవాళ(సోమవారం) ప్రత్యేక విమానంలో మధ్యప్రదేశ్ సీఎం రమేష్‌తో కలిసి ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్నారు. అక్కడి నుంచి అనకాపల్లి గవరపాలెం నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు. ఎన్నికల ముందు అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో గెలిచిన వెంటనే నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే ప్రమాణ స్వీకారం చేస్తానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 

ఈ నేపథ్యంలో ఇవాళ అమ్మవారిని దర్శించుకుని పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పవన్ పిఠాపురం బయలుదేరారు. పిఠాపురంలో పార్టీ నేతలతో కీలక సమావేశంలో పాల్గొన్నారు. టీడీపీ - జనసేన నేతల మధ్య నెలకొన్న అసంతృప్తుల నేపథ్యంలో పవన్ వారితో సమావేశం కానున్నట్లు సమాచారం. ఇరు పార్టీ నేతలతో జనసేనాని మాట్లాడనున్నారు. ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ మంత్రి పదవిని తీసుకుంటారా? ఒకవేళ తీసుకుంటే ఏ శాఖను ఎంచుకుంటారు? అనేది అత్యంత చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు మరో కీలక మంత్రి పదవి అప్పజెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది.

Read More ఎం.ఎస్. ప్లైవుడ్ ఫ్యాక్టరీ కార్మిక‌ ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు.. కలెక్టర్ గారూ ఇదేం తీరు..

🕒 10 Jun 2024 ✍️ Desk

నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి సతీసమేతంగా హాజరైన సంగతి తెలిసిందే. ఇవాళ(సోమవారం) ప్రత్యేక విమానంలో మధ్యప్రదేశ్ సీఎం రమేష్‌తో కలిసి ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్నారు. అక్కడి నుంచి అనకాపల్లి గవరపాలెం నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు. ఎన్నికల ముందు అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో గెలిచిన వెంటనే నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే ప్రమాణ స్వీకారం చేస్తానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 

ఈ నేపథ్యంలో ఇవాళ అమ్మవారిని దర్శించుకుని పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పవన్ పిఠాపురం బయలుదేరారు. పిఠాపురంలో పార్టీ నేతలతో కీలక సమావేశంలో పాల్గొన్నారు. టీడీపీ - జనసేన నేతల మధ్య నెలకొన్న అసంతృప్తుల నేపథ్యంలో పవన్ వారితో సమావేశం కానున్నట్లు సమాచారం. ఇరు పార్టీ నేతలతో జనసేనాని మాట్లాడనున్నారు. ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ మంత్రి పదవిని తీసుకుంటారా? ఒకవేళ తీసుకుంటే ఏ శాఖను ఎంచుకుంటారు? అనేది అత్యంత చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు మరో కీలక మంత్రి పదవి అప్పజెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది.

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/pawan-kalyan-visited-goddess-nukambika/article-1595

Related Posts