చేనేత సమస్యల పై అఖిలపక్ష సమావేశం జయప్రదం చేయండి- రాపోలు వీరమోహన్
On
ఎల్బీనగర్ , విశ్వంభర :జూన్ 27:-తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ ఎల్బీ నగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చేనేత సమస్యలపై జూన్ 30 ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని ఎల్బీనగర్ స్వకుళశాలి భవన్ లో సమావేశం నిర్వహించనున్నారు. చేనేత కార్మికులకు జరుగుతున్నా అన్యాయాలపై , చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేనేత కార్మిక సంఘాలు ,చేనేత కార్మికులు , పద్మశాలి సంఘాలు వివిధ రాజకీయ పార్టీలకు సంబందించిన నాయకులు పాల్గొని చేనేత వ్యవస్థను బలోపేతం చేసే విషయాలపై చేనేత మనుగడ గురించి పెద్ద ఎత్తున కార్యాచరణ ఈ అఖిలపక్ష సమావేశంలో చర్చించే విధంగా ఉంటుందని మీరు, మీ ప్రాంతాలలో ఉన్న ముఖ్యమైన నాయకులు హాజరు అయ్యి సమావేశాన్ని జయప్రదం చేయాలని అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ కోరడం జరిగింది.