చిన్నారులతో రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకున్న ప్రధాని మోదీ

చిన్నారులతో రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకున్న ప్రధాని మోదీ

  • రాఖీ పండుగ వేళ చిన్నారులతో ప్రధాని మోదీ ఆత్మీయ క్షణాలు

: రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చిన్నారులతో కలిసి రక్షాబంధన్‌ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి ప్రధాని మోదీకి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపింది. చిన్నారి తీసుకొచ్చిన రాఖీని మోదీ ఆప్యాయంగా స్వీకరించారు. రాఖీ పండుగ సందర్భంగా చిన్నారులతో మోదీ సరదాగా ముచ్చటిస్తూ ఆత్మీయంగా గడిపారు. చిన్నారులు ప్రేమతో తీసుకొచ్చిన రాఖీలను స్వీకరించిన ఆయన వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించింది.

రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకానికి ప్రతీకగా జరుపుకుంటారు. అయితే పండుగ సందర్భంగా చిన్నారులు ప్రధానిని కలిసి రాఖీ కట్టడం ప్రత్యేకంగా నిలిచింది. ప్రధాని మోదీ కూడా చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడటం, వారి రాఖీలను స్వీకరించడం ఆకట్టుకుంది.చిన్నారులతో ప్రధాని మోదీ రాఖీ వేడుకలు జరుపుకున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రాఖీ పండుగ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఆత్మీయ క్షణాలను పలువురు నెటిజన్లు పంచుకుంటున్నారు.

Read More మహాత్మా గాంధీ హత్యకు ఆర్‌ఎస్‌ఎస్‌ కారణమంటూ అమెరికాలో నిరసనలు