సీఐ అత్యుత్సాహం...ఆందోళన చేస్తున్న బాధితులపై దాడి

సీఐపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు, ప్రజా సంఘాల డిమాండ్

సీఐ అత్యుత్సాహం...ఆందోళన చేస్తున్న బాధితులపై దాడి

విశ్వంభర,సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో డబ్బకొట్టు తొలగించారని బాధితులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతగా మారింది. ఘటన స్థలానికి చేరుకున్న సీఐ శివశంకర్ ఆందోళన చేస్తున్న మందల ఉపేందర్ పై ఒక్కసారిగా దాడికి దిగి రోడ్డుపై నెట్టేశాడు. అంతటితో ఆగకుండా అతన్ని లాక్కెళ్లి పోలీసు కారులో పడేశాడు. అడ్డుకున్న మహిళలను తోసేస్తూ వీరంగం సృష్టించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీడియోలు చిత్రీకరిస్తున్న ఓ జర్నలిస్ట్ పై సైతం రెండు సార్లు దాడికి దిగడం చర్చనీయాంశం అయ్యింది. అంతకుముందు బాధితులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గత ముప్పై ఏళ్ళుగా డబ్బకొట్టు పైనే జీవనం సాగిస్తున్నామన్నారు. తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి సదరు సీఐపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Tags: