తార్నాకలో బీజేపీలోకి ప్రముఖులు.. రామ్‌చందర్‌రావు ఆధ్వర్యంలో చేరికలు
- మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి ఆకర్షితులై బీజేపీలో చేరిన తార్నాక ప్రముఖులు
BJP Joinings: హైదరాబాద్ తార్నాకలో బీజేపీకి మరింత మద్దతు పెరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ నిర్మాణం కోసం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తార్నాకకు చెందిన పలువురు ప్రముఖ పౌరులు బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామ్‌చందర్‌రావు సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకుని బీజేపీలో చేరారు.
దేశాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తున్నాయని రామ్‌చందర్‌రావు పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో పలువురు బీజేపీలోకి వస్తున్నారని తెలిపారు.
తార్నాకకు చెందిన ప్రముఖ పౌరులను బీజేపీ కుటుంబంలోకి రామ్‌చందర్‌రావు ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కొత్తగా పార్టీలో చేరిన వారు బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని, అభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతున్న బీజేపీతో మరింత మంది ప్రజలు కలిసివస్తున్నారని రామ్‌చందర్‌రావు తెలిపారు. తార్నాకలో ప్రముఖుల చేరికతో స్థానికంగా పార్టీకి మరింత బలం చేకూరుతుందని బీజేపీ శ్రేణులు పేర్కొన్నాయి.



