సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన కొండా సురేఖ, సీతక్క

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన కొండా సురేఖ, సీతక్క

విశ్వంభర,హైదరాబాద్ :రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రులు దానసరి సీతక్క, కొండా సురేఖ కలిశారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన ఇద్దరు మంత్రులు ఆయనకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రాఖీ కట్టడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.WhatsApp Image 2026-08-28 at 1.23.33 PM

సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఉన్న సమయంలో ఈ కార్యక్రమం జరిగింది. కొండా సురేఖ ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు రాఖీని ముఖ్యమంత్రికి కట్టినట్లు తెలిసింది. ప్రతిసారి రాఖీ కట్టినట్లుగానే ఈసారి కూడా కట్టానని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రాష్ట్రానికి మంచి సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు. ఇది తాను రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం మూడోసారి అని సురేఖ వెల్లడించారు. ముఖ్యమంత్రితో పాటు ఆయన మనవడు, అల్లుడికి కూడా ఆమె రాఖీలు కట్టారు. తాను కూడా అందరిలాగే ఒక ఆడపడుచునేనని, తనను ప్రత్యేకంగా చూడవద్దని మీడియాకు తెలిపారు.

Read More రాఖీ పౌర్ణమి వేళ మహాకాళేశ్వరుడికి పంచామృత అభిషేకం

Tags: