జీవీ నారాయణరావు పార్థివదేహానికి చిరంజీవి నివాళులు
On
- నటుడు, నిర్మాత జీవీ నారాయణరావుకు చిరంజీవి నివాళులు
Megastar Chiranjeevi: ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. జీవీ నారాయణరావు మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన చిరంజీవి.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా, నిర్మాతగా జీవీ నారాయణరావు అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. జీవీ నారాయణరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు.



