9 నెలల చిన్నారిని చెరువులో ముంచి హత్య చేసిన తల్లి.. ఎల్‌బీనగర్‌లో విషాదం
- హైదరాబాద్‌లో దారుణం.. మద్యం మత్తులో పసిపాపను చెరువులో ముంచిన తల్లి
- బైరామల్‌గూడ చెరువులో 9 నెలల చిన్నారి మృతి.. తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hyderabad Crime: హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. బైరామల్‌గూడ చెరువులో 9 నెలల చిన్నారిని ఆమె తల్లే ముంచి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇంజాపూర్‌కు చెందిన లోకసాని రాజేశ్వరి (34) తన 9 నెలల కుమార్తె లోకసాని అనురాధను బైరామల్‌గూడ చెరువు వద్దకు తీసుకెళ్లి నీటిలో ముంచినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక దర్యాప్తులో ఘటన సమయంలో నిందితురాలు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనకు దారితీసిన పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత సమస్యలు లేదా ఇతర కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. పసిపాప ప్రాణాలు కోల్పోయిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, చిన్నారిపై ఇంతటి అమానుషానికి పాల్పడిన తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఎల్‌బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.