మద్యం మత్తులో రెచ్చిపోయిన జంట అరెస్ట్..!

మద్యం మత్తులో రెచ్చిపోయిన జంట అరెస్ట్..!

వాకర్స్‌తో గొడవ పడిన అలెక్స్ బొడి చేర్ల(25), అతడితో ఉన్న అమ్మాయిని నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. వారిపై ఐపీసీ 341, 504 సెక్షన్ల కింద కేసు న‌మోదు చేసినట్లు తెలిపారు.

హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం ఉదయం నడిరోడ్డుపై బీర్ తాగుతూ ఇదేంట‌ని అడిగిన వారితో యువతీ యువకుడు హల్‌చల్ చేసిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా మద్యం మత్తులో మార్నింగ్ వాకర్స్‌పై సదరు యువతి ఇష్ట‌మొచ్చిన‌ట్లు దుర్భాషలాడింది. న‌డిరోడ్డుపై మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ ప్రశ్నించిన వారితో గొడవ పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

కాగా, వాకర్స్‌తో గొడవ పడిన అలెక్స్ బొడి చేర్ల(25), అతడితో ఉన్న అమ్మాయిని నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. వారిపై ఐపీసీ 341, 504 సెక్షన్ల కింద కేసు న‌మోదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. సదరు యువతి పోలీస్ స్టేషన్‌లో ఉన్న వీడియో వైరల్‌గా మారింది.

Read More రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు - బిఎన్  రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి