అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం రేవంత్ ఆదేశాలు జారీచేశారు.
ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం రేవంత్ ఆదేశాలు జారీచేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సింగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా రేవంత్ ఆదేశించారు.ఓమీడియాదిగ్గజానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపడం దేశంలో ఇదే మొదటిసారి.
ఇదిలా ఉండగా, రామోజీరావు భౌతికకాయానికి ఎప్పుడు అంత్యక్రియలు నిర్వహిస్తారనేది తెలియాల్సివుంది. ఆయన కుటుంబసభ్యులు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వారంతా హైదరాబాద్ చేరుకున్న తర్వాతే అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రామోజీరావు కుమారుడు, ఆయన కోడలు, మనవడు, మనవళ్లు విదేశాల్లోనే ఉన్నారు. వారంతా హైదరాబాద్ చేరుకున్న తర్వాత అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు సమాచారం. ఫిలిసిటీలోనే రామోజీరావు అంత్యక్రియలు జరుగుతాయని ఆయన సన్నిహితులు తెలిపారు. ఆయన తాను ఇష్టపడి నిర్మించుకున్న ఫిలింసిటీలోనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నారు.