హైదరాబాద్‌ నుంచి వెళ్తున్న విమానంలో మంటలు

హైదరాబాద్‌ నుంచి వెళ్తున్న విమానంలో మంటలు

  • కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి తప్పిన ముప్పు 
  • టేకాఫ్ అయిన 15 నిమిషాలకే కుడి ఇంజిన్‌ మంటలు
  • పైలట్ అప్రమత్తం.. సేఫ్ ల్యాండింగ్  
  • విమానంలో 130 మంది ప్రయాణికులు

హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ బయల్దేరిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన 15నిమిషాలకే కుడివైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో విమానంలో సిబ్బంది సహా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పైలట్ మంటలను గుర్తించి సేఫ్‌గా ల్యాండింగ్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఇవాళ (గురువారం) ఉదయం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కౌలాలంపూర్ మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం కౌలాలంపూర్‌ బయల్దేరడానికి సిద్ధమైంది. చెకింగ్ పూర్తయ్యాక విమానం టేకాఫ్ అయింది. 

ఆ సమయంలో విమానంలో సిబ్బందితో సహా 150మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే టేకాఫ్ అయిన 15 నిమిషాలకే విమానం కుడివైపు ఉన్న ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమై ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు. ఈ క్రమంలో ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో ఆందోళనకు గురయ్యారు. అందరూ కదలకుండా కూర్చోవాలని పైలట్ అనౌన్స్ చేశాడు. దీంతో ప్రయాణికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఎవరి సీట్లలో వారు అలాగే కూర్చున్నారు. 

Read More ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి:మాజీ సర్పంచ్ ఉజ్జిని నరేందర్ రావు 

అయితే కొద్దిసేపటి దాకా ల్యాండింగ్‌కు అనుమతి కోసం వేచిచూశాడు పైలట్. అప్పటి దాకా విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించాడు. ఈ క్రమంలో ఏటీసీ అధికారులు ప్రమాద తీవ్రతను గుర్తించి అత్యవసర లాండింగ్‌కు అనుమతించారు. దీంతో మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం సేఫ్‌గా ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు, సిబ్బంది, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తంగా ఉన్న పైలట్‌ను అధికారులు ప్రశంసించారు. అయితే, విమానంలో ఎందుకు మంటలను చెలరేగాయో అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదని మీడియాతో తెలిపారు.