మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అపెక్స్ కౌన్సిల్ ఛైర్మన్ గా ఆది శ్రీనివాస్

మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అపెక్స్ కౌన్సిల్ ఛైర్మన్ గా ఆది శ్రీనివాస్

హైద్రాబాద్ , విశ్వంభర:- బడుగు బలహీన వర్గాల సంక్షేమం,సముద్ధరణకు తన వంతు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పటేల్ చెప్పారు.మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అపెక్స్ కౌన్సిల్ ఛైర్మన్ గా నియమితులైన ఆయన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు.సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అధ్యక్షతన ఈనెల 14,29వ తేదీలలో సమావేశమైన అపెక్స్ కౌన్సిల్ ఆది శ్రీనివాస్ పటేల్  ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని కౌన్సిల్ కన్వీనర్ సర్థార్ పుటం పురుషోత్తమ రావు, సభ్యులు వీరమళ్ల ప్రకాష్,పూల రవీందర్,రౌతు కనకయ్య,సీ.విఠల్, మీసాల చంద్రయ్య,ఆకుల రజిత్ తదితర ప్రముఖులు అందజేశారు.ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,తనను కౌన్సిల్ ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సంఘం ప్రముఖులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

మున్నూరుకాపులతో పాటు బడుగు బలహీన వర్గాలు,పేద ప్రజల సంక్షేమం, ఉన్నతికి ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా చేయూతనందిస్తానన్నారు.ఈ విధంగా తనను ఎన్నుకుని కులానికి మరింత సేవ చేసే అవకాశం కల్పించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని వివరించారు.

Read More అక్టోబర్ 6న రంగ్ దే దాండియా నైట్ కార్యక్రమం 

ఈ సందర్భంగా ఆయన్ను అపెక్స్ కౌన్సిల్ వచ్చే నెల 10వ తేదీన స్వర్గీయ కేంద్ర మాజీ మంత్రి, ఓబీసీలకు రాష్ట్రంలో,అటు జాతీయ స్థాయిలో రిజర్వేషన్ల కల్పనకు పాటుపడిన స్వర్గీయ పుంజాల శివశంకర్ పటేల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తీర్మానించింది.అదేవిధంగా శివశంకర్ విగ్రహాలను వీలైన చోట ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కౌన్సిల్ సభ్యులు తీర్మానించారు.

కార్యక్రమంలో ఛైర్మన్ ఆది శ్రీనివాస్ ను సభ్యులు పుష్పగుచ్ఛమిచ్చి శాలువాతో సత్కరించారు.కౌన్సిల్ సమావేశానికి సభ్యులు మంగళారపు లక్ష్మణ్,బత్తినీడు ఆది విష్ణుమూర్తి,సత్తు మల్లేష్,,ఎర్రా నాగేందర్,ఊసా రఘు, లవంగాల అనిల్,బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆవుల రామారావు, పి యల్ యన్ పటేల్ తదితర ప్రముఖులు హాజరయ్యారు

 

 

 

Tags: