ఆత్మకూరులో రైతులకు విత్తనాల పంపిణీ.. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

ఆత్మకూరులో రైతులకు విత్తనాల పంపిణీ.. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

  • పశువులకు గడ్డి కొరతపై అవగాహన.. సైలేజ్ తయారీపై రైతులకు వివరణ

Atmakur News: ఆత్మకూరు మండలం పి.యాలేరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ ట్రయల్, మోడల్ రైతుల సదస్సును నిర్వహించారు. రైతు శ్రీలత పొలంలో ముట్టాల క్లస్టర్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మండల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు.

ఏలినినో పరిస్థితుల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సదస్సులో ప్రధానంగా చర్చించారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై రైతులకు సూచనలు అందించారు.

Read More అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ

చిన్న జీవాలు, పశువులకు గడ్డి కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో సైలేజ్‌తో పాటు సంపూర్ణ సమీకృత దాణా తయారీ విధానంపై రైతులకు వివరించారు. పశువులకు అవసరమైన మేతను ముందుగానే అందుబాటులో ఉంచుకునే విధానాలపై అవగాహన కల్పించారు.

రైతులకు ఉలవలు, జొన్నలు, పెసర, అలసంద, సద్ద విత్తనాలను పంపిణీ చేశారు. వీటిని ప్రత్యామ్నాయ పంటలుగా సాగు చేసుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటలను ఏ విధంగా సాగు చేయాలి, రైతులు పాటించాల్సిన విధానాలు ఏమిటనే అంశాలపై కూడా అవగాహన కల్పించారు.

రైతుల సలహాలు, సూచనలను సేకరించి తదుపరి చర్యలు చేపట్టాలని సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సిబ్బంది సబీహా, మధుమోహన్, మంజునాథ్, మాధవరెడ్డి, బీఓడీ అక్కమ్మ, కార్యకర్తలు శిరీష, వెంకటలక్ష్మి, లక్ష్మితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

Tags: