షాద్‌నగర్ ప్రైవేట్ స్కూల్లో విషాదం.. మెట్లపై నుంచి జారిపడి నాలుగో తరగతి విద్యార్థిని మృతి

షాద్‌నగర్ ప్రైవేట్ స్కూల్లో విషాదం.. మెట్లపై నుంచి జారిపడి నాలుగో తరగతి విద్యార్థిని మృతి

  • ఇండియన్ హైట్స్ ప్రైవేట్ స్కూల్లో పాఠశాల వేళల్లో చోటుచేసుకున్న ప్రమాదం

Shadnagar School Tragedy: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఇండియన్ హైట్స్ ప్రైవేట్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న వర్ణిక అనే విద్యార్థిని ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి కిందపడి మృతి చెందింది. పాఠశాల వేళల్లోనే ఈ దుర్ఘటన జరగడంతో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పాఠశాలలో నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి మెట్లపై నుంచి విద్యార్థిని కిందపడిపోయింది.

ఈ ఘటనలో వర్ణికకు తీవ్ర గాయాలు కావడంతో పాఠశాల యాజమాన్యం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. అయితే అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి అకాల మరణంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. పాఠశాలలో ఈ ప్రమాదం ఎలా జరిగింది? విద్యార్థిని కిందపడటానికి గల ఖచ్చితమైన కారణాలు ఏంటి? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పాఠశాలలో పిల్లల భద్రత పట్ల యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందా అన్న కోణంలో సమాచారం రావాల్సి ఉండగా, ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

Read More  వైఎస్సార్‌ కు ఘన నివాళులు - జక్కిడి ప్రభాకర్‌రెడ్డి.

Related Posts

Advertisement

LatestNews

విద్యార్థుల సంక్షేమానికి గద్దె విజయ్ నేత సేవా కార్యక్రమం.
హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి.. హోంగార్డు ఆనంద్ అరెస్ట్
సీఎం పర్యటనతో విశాఖలో బస్సుల కొరత.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు ఎమ్ అరవింద్ కుమార్ జన్మదినం సందర్బంగా ప్రభుత్వ పాఠశాలలో నోట్ బుక్స్ , ప్రోటీన్ మిల్క్ షేక్స్ పంపిణి 
రేపే కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ.. బ్లూప్రింట్ ప్రకటించనున్న కవిత
మచిలీపట్నంలో వివాహ వివాదం.. భర్త ఇంటి ఎదుట మహిళ ఆందోళన
శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కల్వర్టులోకి దూసుకెళ్లిన కారు